Monday, May 13, 2024

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో శ్వేతపత్రం విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణా శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ మొదలైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించలేదనీ, ఫలితంగా రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బు తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొందని భట్టి పేర్కొన్నారు. ఇది దురదృష్టకరమైన పరిణామమన్నారు.

అయితే శ్వేతపత్రాన్ని చదివేందుకు తగిన సమయం ఇవ్వనందుకు ప్రతిపక్ష సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుపట్టారు. 42 పేజీల పుస్తకాన్ని చేతిలో పెట్టి వెంటనే స్పందించమంటే ఎలాగని ప్రశ్నించారు. తొలుత సభ ప్రారంభం కాగానే ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ పేరును, సిపిఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేని సాంబశివరావు పేరును స్పీకర్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News