Wednesday, September 17, 2025

కేజ్రీవాల్‌కు మూడోసారి ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

జనవరి 3న హాజరుకావాలని ఆదేశం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్సమెంట్ డైరెక్టరేట్(ఇడి) శు క్రవారం మూడవ సమన్లు జారీచేసింది. జనవరి 3న ఢిల్లీలోని ఇడి కార్యాలయంలో హాజరుకావాలని కేజ్రీవాల్‌ను ఇడి ఆదేశించింది. ఈ నెల 21న హాజరుకావాలని ఇడి రెండవ సమన్లు జారీచేసినప్పటికీ 10 రోజులపాటు విపాసన ధ్యానంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్ బుధవారమే వెళ్లిపోయారు. జనవరి 3న కూడా ఇడి ఎదుట హాజరుకాని పక్షంలో కేజ్రీవాల్‌పై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేసే అవకాశం ఉంది.

రెండవ సమన్లకు లేఖ ద్వారా సమాధానమిచ్చిన కేజ్రీవాల్ ఇవి రాజకీయ దురుద్దేశంతో జారీచేసివవని, చట్టవిర్ధుమైనవని ఆరోపించారు. తన జీవితాన్ని నిజాయితీగా, పారదర్శకంగా జీ వించానని, దాచడానికి తన వద్ద ఏమీ లేదని ఇడికి రాసిన ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. మొదట నవంబర్ 2న హాజరుకావాలని కేజ్రీవాల్‌కు ఇడి సమన్లు జారీ చేసింది. అయితే ఐదు రాష్ట్రాలలో అసెంబీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళుతూ ఆయన సమన్లను వాపసు తీసుకోవాలని ఇడిని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News