Saturday, May 11, 2024

శనివారం రాశి ఫలాలు(23-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది.

వృషభం – అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

మిథునం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండము. నూతన వస్తు కొనుగోలు.

కర్కాటకం – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు.

సింహం – అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దూరపు బంధువుల నుండి కీలక సమాచార అందును.

కన్య – బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన సన్నిహితుల సాయంతో తీరుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

తుల – భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానంనకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. వాహనాల విషయాల్లో జాగ్రత్త వహించాలి.

వృశ్చికం – సంఘంలో గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.

ధనుస్సు – వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

మకరం – ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. రుణ వత్తిడులు కొంత వరకు తీరుతాయి. అనుకోని అవకాశాలు అందివస్తాయి. కొంతమంది వ్యక్తుల మాటల వల్ల కొద్దిపాటి నిరాశ  ఏర్పడుతుంది.

కుంభం – నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తలు  ఆనందం కలిగిస్తాయి. విందు, వినోదాలు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

మీనం – ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందుతాయి. పరిస్థితి కొంత వరకు అనుకూలంగా వుండును.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News