Wednesday, October 9, 2024

తాప్సీ ఫస్ట్ లవ్‌లో ఫెయిల్..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ను తెచ్చుకున్న తరువాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న బ్యూటీ తాప్సీ. ఈ పంజాబీ ముద్దుగుమ్మ తెలుగులో ఝుమ్మంది నాదం మూవీతో హీరోయిన్‌గా ప్రవేశించి తర్వాత గ్లామర్ క్వీన్‌గా స్టార్ హీరోలతో జత కట్టింది. కొంతకాలం తెలుగులో నటించిన ఈ భామ బాలీవుడ్‌లో బేబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సక్సెస్‌తో ఇక వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ భామ డంకీ మూవీలో ఏకంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కి జోడీగా నటించి బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమాలో తాప్సీ సటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇదిలా ఉండగా డంకీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ భామ చిన్నతనంలో తన ప్రేమ విషయాలను చెప్పింది. తన స్కూల్ డేస్‌లో తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే తనకంటే సీనియర్ ని ప్రేమించానని పేర్కొంది. ప్రారంభంలో అతను కూడా నాపై ఇష్టం చూపించేవాడని… తరువాత చదువుకు ఆటంకం కలుగుతుందని దూరం పెట్టాడని చెప్పింది. ఆవిధంగా ఫస్ట్ లవ్‌లో ఫెయిల్ అయ్యాక ఆ బాధ నుంచి బయటకి రావడానికి చాలా సమయం పట్టిందని తాప్సి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News