Monday, May 13, 2024

సౌదీలో హజ్‌ఉమ్రాహ్ సదస్సుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

- Advertisement -
- Advertisement -

జెడ్డా : సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్న తృతీయ హజ్‌ఉమ్రాహ్ ప్రారంభ సదస్సుకు మంగళవారం కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ యాత్రికులకు సౌకర్యాలు, సేవలు విస్తృతంగా కల్పించే విషయమై మక్కా రీజియన్ డిప్యూటీ గవర్నర్, హజ్‌ఉమ్రాహ్ మంత్రి కెస్‌ఎతో చర్చించారు. ఆమెతోపాటు కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.

సౌదీ ప్రభుత్వం ఆహ్వానం ఘనంగా అందించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు. ఇస్లాం పవిత్రస్థలమైన మదీనాను కూడా సోమవారం ఇరానీ సందర్శించారు. ఆదివారం భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య ద్వైపాక్షిక హజ్ ఒప్పందం 2024 కుదిరింది. 2024లో వార్షిక హజ్ యాత్రకు 1,75, 025 భారతీయులను పంపడానికి ఒప్పందం కుదిరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News