Friday, May 3, 2024

ఫ్రాన్స్‌కు తొలి ‘గే’ ప్రధాని గాబ్రియల్…

- Advertisement -
- Advertisement -

ఉద్రిక్తతల నేపథ్యంలో నియమించిన మెక్రాన్

పారిస్ : ఫ్రాన్స్‌కు కొత్త ప్రధానిగా విద్యాశాఖ మంత్రి గాబ్రియెల్ అట్టల్ నియామకమయ్యారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ఈమేరకు గాబ్రియల్‌ను నియమించారు. ప్రధాని పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడైన 34 ఏళ్ల గాబ్రియెల్ స్వలింగ సంపర్కుడు. ఇంతవరకు ప్రధాని పదవిలో ఉన్న ఎలిజెబెత్ బోర్న్ సోమవారం రాజీనామా చేయడంతో ఈ నియామకం తాజాగా జరిగింది.

ఇటీవల అమలు లోకి తెచ్చిన వివాదాస్పద ఇమిగ్రేషన్ చట్టంపై రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో బోర్న్ రాజీనామా చేయవలసి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం విదేశీయులను వెనక్కి పంపేందుకు ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. 46 ఏళ్ల మెక్రాన్ పదవీకాలం 2027తో ముగుస్తుంది. మెక్రాన్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న అట్టల్ కొవిడ్ సమయంలో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో అట్టల్ నియామకం కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News