Tuesday, May 21, 2024

రాత్రి సమయంలో ఆ సినిమాలు చూస్తానన్న పవన్… ఛీ ఇదేం అలవాటు అంటూ ట్రోలింగ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తన మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకపడుతున్నారు. జనసేన పిఠాపురం నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా అప్పుడప్పుడు ఇంటర్వూలు కూడా ఇస్తుంటాడు. ఓ ఇంటర్వూలో పవన్ కల్యాణ్ మాట్లారు. నీకు ఇష్టమైన సాంగ్ ఏది అని యాంకర్ అడగాగనే… హిందీలో సూపర్ హిట్ అయిన ఏ రాతే ఏ మౌసమ్ అనే పాట ఇష్టమని పవన్ తెలిపారు. రాత్రి సమయంలో ఎలాంటి సినిమాలు చూడాటానికి ఇష్ట పడుతారని అని యాంకర్ అడిగారు. తాను ఎక్కువగా హర్రర్ సినిమాలు చూస్తానని, ఆ సినిమాలు చూసేటప్పుడు మైండ్ మొత్తం దాని మీదే ఫోకస్‌గా ఉంటుందని వివరించారు.

మైండ్ మొత్తం సైలెంట్‌గా మారడంతో కాస్త ప్రశాంతత దొరుకుతుందని చెప్పారు. నిజ జీవితంలో కనిపించే డెవిల్స్‌తో పోల్చితే హర్రర్ సినిమాలలో చూసే డెవిల్స్ అంటే తనకు ఇష్టమని పవన్ పేర్కొన్నారు. దీంతో పవన్‌కు సంబంధించిన వీడియోన ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏ రాతే ఏ మౌసమ్ అనే హిందీ పాటను పవన్ కూతురు ఆద్యా పాడింది. క్యూట్ ఫాదర్, క్యూట్ డాటర్ అని పవన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాత్రి సమయంలో దెయ్యాల చిత్రాలు చూడటం ఏంటీ అని విమర్శకులు పవన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News