Saturday, July 27, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద చిక్కిన చిరుత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన చిరుతను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఎయిర్ పోర్టు రన్‌వే పై చిరుత కనిపించడంతో విమానాశ్రయ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచరించినట్టుగా ఆనవాళ్లు ఉండడంతో పాటు సిసి కెమెరాలో అది కనిపించడంతో ఐదు చోట్లు బోన్లతో పాటు 20 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలతో పాటు కోడి మాంసం కూడా ఉంచారు. చిరుత బోను వద్దకు వచ్చి తిరిగి వెళ్లిపోతుండడంతో అటవీ శాఖ అధికారులు, శంషాబాద్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

రాత్రి ఆహారం తినేందుకు బోనులోకి చిరుత వచ్చి చిక్కుకుంది. దీంతో అటు అటవీ శాఖ అధికారులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాసేపట్లో ఎయిర్ పోర్ట్ నుంచి చిరుతను నెహ్రూ జూ పార్క్ కు అధికారులు తరలించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఒకరోజు పాటు జూ అధికారులు పర్యవేక్షణలో ఉంచనున్నారు. తర్వాత నల్లమల అడవిలో వదిలేస్తామన్న అటవీ శాఖ అధికారులు తెలిపారు.  అటవీ ప్రాంతం తగ్గిపోవడంతో జనవాసాల్లోకి చిరుతలు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా అటవీ విస్తీర్ణం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News