Saturday, July 27, 2024

అప్పుడు చేయలేదు… ఇప్పుడు చేస్తారా?… కూటమి మేనిఫెస్టోపై పెదవి విరుపు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ఏర్పడిన కూటమిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇది కేవలం నామ మాత్రంగా పెట్టుకున్నదే తప్ప ఇష్టపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం కలిసింది లేదు. అందులో తమ పాత్ర ఎక్కువ లేదు అని బయటపడినట్టు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి మ్యానిఫెస్టో కాపీలో ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, పథకాలు గురించి చెప్పలేదు. కేవలం రెండు పార్టీల అధినేతల ఫోటోలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయవ్యక్తం చేసినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాకుండా అది కేవలం టిడిపి, జనసేన పార్టీల మేనిఫెస్టో అని, బిజెపితో సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం.

అప్పుడు ఏమి జరిగింది..?

2014 లోనూ ఇదే మూడు పార్టీలు పొత్తులతో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్నికలకు ముందు వందల హామీలు ఇచ్చింది కానీ వాటిని నెరవేర్చలేదు. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్ సైట్ నుంచి మాయం చేశారు అనే వాదన ఉంది. ఇప్పుడు కూటమి మ్యానిఫెస్టో గురించి మాట్లాడుతుంటే అందరూ షాక్ అవుతున్నారు. ఈ హామీలకు అప్పట్లో కొత్త పార్టీ కూడా గ్యారంటీ పలికింది. మళ్ళీ అలాంటి సాధ్యం కాని హామీలు ఇచ్చే కూటమికి ఓటు వేస్తే మొదటికే మోసం వస్తుందని ఎపి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ మ్యానిఫెస్టోతో మాకు సంబంధం లేదు అంటే ఆంద్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏంటి? అని రాజకీయ పరిశీకులు వాపోతున్నారు. మరోపక్క ఎమ్మెల్యే, ఎంపి టిక్కెట్ల విషయంలో కూడా అవకతవకలు జరిగాయనే వాదన కూడా ఉంది.

మరోపక్క సిఎం జగన్ ఇచ్చిన హామీలు తప్పిన సందర్భాలు లేవు. గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ పథకాలు పేద ప్రజల్లోకి వెళ్లడంతో వైసిపిపై ప్రజల నుంచి వ్యతిరేకత లేదు. అందుకే గ్రామాల్లోని ప్రజలు తమ ఓటు జగన్ కే వేస్తామని బలంగా చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News