Monday, August 25, 2025

గిడుగు రుద్రరాజు రాజీనామా.. ఎపి పిసిసి చీఫ్ గా షర్మిల..!

- Advertisement -
- Advertisement -

ఎపి పిసిసి చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఎపి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న ఆయన సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు పంపించినట్లు ఆయన తెలిపారు.

గిడుగు రుద్రరాజు రాజీనామాతో.. త్వరలో ఎపికి కొత్త పిసిసి చీఫ్ ను కాంగ్రెస్ నియమించనుంది. వైఎస్ షర్మిలకు ఆ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. ఆమెకు అస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News