Sunday, May 12, 2024

ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌కు రూ. కోటికి పైగా జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అత్యవసర ఆక్సిజన్ సరఫరా కోసం తప్పనిసరి ఏర్పాట్లు లేకుండానే బోయింగ్ 777 విమానాన్ని అమెరికాకు నడిపారని ఎయిర్‌లైన్ మాజీ ఉద్యోగి ఒకరు చేసిన ఫిర్యాదుపై డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) విచారణలో నిజం తేలడంతో ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 1.10 కోట్ల వరకు జరిమానా పడింది. ఈమేరకు ఎయిర్‌లైన్స్‌పై పౌర విమానయాన మంత్రిత్వశాఖ కఠిన చర్యలు తీసుకుంది.

ఎయిర్ ఇండియా విమాన యాన సంస్థ నిబంధనలను పాటించలేదని తమ దర్యాప్తులో తేలిందని డిజిసిఎ బుధవారం ప్రకటించింది. ఈ విధమైన నిబంధనల ఉల్లంఘన ఆ ఎయిర్‌లైన్స్ లీజుకు తీసుకున్న బోయింగ్ 777 విమానాలకు సంబంధించినదిగా స్పష్టం చేసింది. లీజుకు తీసుకున్న ఈ విమానాల నిర్వహణ పనితీరు పరిమితులకు అనుగుణంగా లేదని, అందుకే ఈ చర్యలు చేపట్టినట్టు డిజిసిఎ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News