Monday, April 29, 2024

కార్మికుల విమానం కూలి ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఒట్టావా : కెనడాలో కార్మికులతో వెళ్తున్నవిమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోవడంతో అందులోని కార్మికుల్లో ఆరుగురు మృతి చెందారు. నార్త్ టెరిటరీస్‌లో ఈ ప్రమాదం జరిగింది. పోర్ట్‌స్మిత్ నుంచి కార్మికులతో చిన్న విమానం రియోటింటో మైనింగ్ సంస్థకు చెందిన దియావిక్ వజ్రాల గని వద్దకు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి.

తర్వాత రన్‌వే చివర నుంచి కిలోమీటర్ పరిధిలో విమానం కుప్ప కూలిందని అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఒకరు ప్రాణాలతో బయటపడినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రమాదస్థలానికి అధికారులు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కుప్పకూలిన విమానం ఛార్టర్ ఫ్లైట్ అని విమానయాన సంస్థ నార్త్‌వెస్టర్న్ ఎయిర్ పేర్కొంది. ఈ ప్రమాదం కారణంగా పోర్ట్ స్మిత్ నుంచి విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. కెనడా రవాణా భద్రతా బోర్టు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News