Sunday, May 12, 2024

నేషనల్ హైవేలపై 1,000 రెస్టు హౌస్‌ల నిర్మాణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:భారతదేశం అత్యంత వేగంగా పురోగమిస్తోందని, తన ప్రభుత్వం మూడవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్నదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మరో రెండు, మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నాడిక్కడ భారత్ బొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ట్రకు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల పొడవునా తొలి దశలో 1,000 అధునాతన విశ్రాంతి గృహాలను నిర్మిస్తామని ప్రకటించారు. 2014కు ముందు పదేళ్లలో సుమారు 12 కోట్ల వాహనాలు దేశంలో విక్రయించగా 2014 నుంచి ఇప్పటివరకు దేశంలో 21 కోట్లకు పైగా వాహనాల విక్రయాలు జరిగాయని ప్రధాని తెలిపారు. 2014కు ముందు దేశంలో సుమారు 2,000 ఎలెక్ట్రిక్ వాహనాలు విక్రయించగా గత పదేళ్లలో 12 లక్షల ఎలెక్ట్రిక్ వాహనాల విక్రయాలు జరిగాయని ఆయన చెప్పారు.

పాసింజర్ వాహనాలలో దాదాపు 60 శాతం ప్రగతి నమోదైందని ఆయన చెప్పారు. మైలిక సదుపాయాల కల్పనా రంగంలో భారతదేశంలో సాధించిన అభివృద్ధిని గురించి కూడా ఆయన వివరించారు. సముద్రాలను, పర్వతాలను కూడా సవాలు చేస్తున్నామని, రికార్డు కాలంలో ఇంజనీరింగ్ అద్భుతాలను సృష్టిస్తున్నామని ఆయన చెప్పారు. అటల్ టన్నెల్ నుంచి అటల్ సేతు వరకు భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కొత్త రికార్డులను సృష్టిస్తోందని, గత పదేళ్లలో 75 కొత్త విమానాశ్రయాలు, దాదాపు 4 లక్షల గ్రామీణ రోడ్ల నిర్మాణం జరిగిందని ప్రధాని చెప్పారు. స్థానికంగా లభించే ముడి సరకులను ఉపయోగించి బ్యాటరీలను తయారుచేసేందుకు పరిశోధనలు చేయాలని ఆయన పరిశ్రమలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News