Sunday, April 28, 2024

కోటలో బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోట: రాజస్థాన్ కోటలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి తన పేయింగ్ గెస్ట్ రూములో ఆత్మహత్య చేసుకున్నాడు. నూర్ మొహమ్మద్ అనే 27 ఏళ్ల విద్యార్థి బుధవారం తన గదిలో ఆత్మహత్య చేసుకోగా గురువారం రాత్రి అతని గదిలో నుంచి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజ్ఞాన్ నగర్‌లోని ఆ విద్యార్థి పేయింగ్ గెస్ట్ రూములో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. గడచిన రెండు వారాలలో కోటలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది మూడవది. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోండకు చెందిన నూర్ మొహమ్మద్ చెన్నైకు చెందిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ నుంచి బిటెక్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నారు. కోటలో పేయింగ్ గెస్టుగా ఉంటున్నారు.

ఇక్కటి తన పేయింగ్ గెస్ట్ రూము నుంచి అతను ఆన్‌లైన్ క్లాసుల ద్వారా చదువుకుంటున్నాడని డిఎస్‌పి ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు. ఏడాదిలో ఇప్పటివరకు మూడు ఆత్మహత్య కేసులు కోటలో వెలుగుచూశాయి. జనవరి 29న జెఇఇకి సిద్ధమవుతున్న నిహారికా సింగ్ అనే విద్యార్థిని సూసైడ్ నోట్లో తన తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఆత్మహత్యకు పాల్పడింది. జనవరి 23న మొహమ్మద్ జైద్ అనే 19 ఏళ్ల విద్యార్థి కోటలోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన జైద్ నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష కోసం కోటలో సిద్ధమవుతున్నాడు. అతని గదిలో సూసైడ్ నోట్ లభించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News