Thursday, July 17, 2025

సూర్యాపేటలో ఆటోను ఢీకొట్టిన బస్సు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

మోతే: సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్ర సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మునగాల మండలం రామసముద్రం గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు, మిరప తోటలో కూలి పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News