Friday, May 3, 2024

బలం కోసం నాణేలు, అయస్కాంతాలు మింగాడు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆకలిస్తే మనుషులు, జంతువులు ఆహారం కోసం వెతుకుతాయి. తన ఇష్టమైన ఆహారాన్ని మనుషులు భుజిస్తారు. క్రూర జంతువులు మరో జంతువులు వేటాడి తింటాయి. తన శరీరానికి జింక్ అవసరం ఉందని రూపాయి నాణేలు, అవి కడుపులో నుంచి బయటకు రాకుండేందుకు అయస్కాంతాలు మింగిన సంఘటన ఢిల్లీలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల యువకుడు శరీరానికి జింక్ అవసరం చాలా ఉందని ఎక్కడో పుస్తకాల్లో చదివాడు. వెంటనే 39 రూపాయి నాణేలు సేకరించి అప్పుడప్పుడు కొన్ని కొన్ని మింగాడు. ఆ నాణేలు బయటకు రాకుండా ఉండేందుకు 37 అయస్కాంతాలను మింగాడు. జింక్ తన దేహాన్ని ధృడంగా ఉంచుతుందని నమ్మకంతో అతడు మింగాడు. కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుండడంతో అతడిని సర్ గంగారాం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో స్కాన్ చేయగా అతడి కడుపులో నాణేలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి కడపులో ఉన్న ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల 39 నాణేలు, 37 అయస్కాంతాలను బయటకు తీశారు. ఏడు రోజులపాటు చికిత్స చేసిన తరువాత డిశ్చార్జ్ చేశామని ల్యాప్రొస్కోపిక్ సర్జన్ తరుణ్ మిట్టల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News