Thursday, May 9, 2024

పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ ధరను దేశీయ చమురు సంస్థలు పెంచాయి. ఎక్కువ ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల సిలిండర్‌పై 25.50 పెరిగినట్టు ఆయిల్ మార్కెట్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. పెరిగిన గ్యాస్ ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1795, ముంబయిలో రూ.1749, కోల్‌కతాలో రూ.1911, చెన్నైలో రూ.1960, హైదరాబాద్‌లో రూ.2027గా ఉంది. గృహ వినియోగ ఎల్‌పిజి గ్యాస్ సిలిందడర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో పాటు విమానయాన ఇంధన ధరలను కూడా ఆయిల్ కంపెనీలు పెంచాయి. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌కు ఎటిఎఫ్ ధర ఢిల్లీలో కిలో లీటర్ రూ.1,01,397కు పెరగగా, కోల్‌కతాలో రూ.1,10,297గా ఉంది. దేశీయ విమానయాన సంస్థలకు ఎటిఎఫ్ ధరలు వరసగా కిలో లీటర్‌కు ముంబయిలో రూ.94,809, చెన్నైలో రూ.1,05,399గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News