Saturday, April 27, 2024

క్యాన్సర్‌తో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మృతి

- Advertisement -
- Advertisement -

అగర్తాలా: మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా క్యాన్సర్‌తో బాధపడుతూ చిన్న వయసులోనే కన్నుమూశారు. గత రెండు సంవత్సరాల ఆమె బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఇబ్బందిపడుతున్నారు. గత కొన్ని రోజుల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె మృత్యువుతో పోరాడుతూ చివరికి ఆమె చనిపోయారు. త్రిపురకు చెందిన రింకీ చక్మా 2017లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని పైనలిస్ట్‌గా నిలిచారు. 2022లో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకడంతో చికిత్స తీసుకున్నారు. తొలుత చికిత్స తీసుకున్నప్పుడు తగ్గినట్టే కనిపించింది. కానీ తిరగబెట్టడంతో క్రమంగా ఊపిరితిత్తులు, తలకు వ్యాపించింది. వైద్య నిపుణులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఫిబ్రవరి 22న ఆమె కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల క్రితం తనకు క్యాన్సర్ సోకిందని, చికిత్స చేసుకోవడానికి డబ్బులు లేవని సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసింది.
దీంతో మిస్ ఇండియా స్నేహితులు ఫండ్స్ సేకరించి, ఆమెకు చికిత్స కోసం ఆ డబ్బులు ఉపయోగించారు. కొన్ని రోజులకే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News