Thursday, May 9, 2024

మంత్రి జయరాం వైసిపికి రాం రాం

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డి విధానాలతోనే విసుగు చెందానని మంత్రి జయరాం తెలిపారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు వైసిపి సభ్యత్వానికి, ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశానని జయరాం స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు నుంచి టిడిపి తరపున పోటీ చేస్తానని చెప్పారు. గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయ్యారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు సజ్జల, ధనుంజయ రెడ్డి ఉన్నారని, వారు చెప్పిందే జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. జయరాం ప్రస్తుతం ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే ఆలూరు అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా గుమ్మనూరును సిఎం జగన్ తొలగించడంతో పాటు అసెంబ్లీ టికెట్ నిరాకరించారు. గుమ్మనూరును కర్నూలు ఎంపి స్థానం నుంచి పోటీ చేయించాలని తొలుత భావించినప్పటికి చివరి నిమిషంలో ఆయనను తప్పించారు. కొంత కాలంగా జగన్ తీరుపై జయరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు మంత్రి అనుచరులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News