Sunday, May 12, 2024

తెలంగాణలో మే 13న పోలింగ్

- Advertisement -
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షె డ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలతోపాటు కం టోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించ నుండగా తెలంగాణలో నాలుగో విడత పో లింగ్ జరగనుందని ఆయన వెల్లడించా రు. నాలుగో విడుతలో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది.

26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు ఇసి గడువు ఇచ్చింది. 13న ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఇసి వివరించింది. లోక్‌సభ ఎన్నికలు మొ త్తం ఏడు విడత జరుగనుండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడుతలో జరుగనున్నాయి. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News