Friday, November 1, 2024

జైలులో కేజ్రీవాల్‌ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ

- Advertisement -
- Advertisement -

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సోమవారం కలుసుకునేందుకు ఆయన భార్య సునీతకు జైలు అధికారులు నిరాకరించారు. ఇప్పటికే ఆప్ నేత ఆతిశీకి అనుమతి ఇచ్చినందున సునీత అభ్యర్థనను తిరస్కరించినట్టు జైలు అదికారులు చెప్పారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఇక పంజాబ్ సిఎం భగవంత్ మాన్ మంగళవారం తీహార్ జైలుకు వెళ్లి కేజ్రీవాల్‌ను కలియనున్నారు.

దీంతో మంగళవారం తర్వాతే సునీతను అనుమతించనున్నట్టు జైలు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే నిబంధనల ప్రకారం వారంలో రెండు సార్లు మాత్రమే ములాఖత్‌కు అనుమతి ఉంది. దీంతో భర్తను చూసేందుకు సునీతకు వచ్చే వారమే అనుమతి లభించనుంది. అయితే జైలులో ఉన్న వ్యక్తితో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు మాట్లాడే వీలుందని, అయినప్పటికీ తీహార్ అధికారులు సునీతను అనుమతించడం లేదని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News