ఫిల్ సాల్ట్(63) విధ్వంసం ముందు ఢిల్లీ నిర్ధేశించిన లక్షం చిన్నదైంది. అతనికి తోడు శ్రేయాస్ అయ్యర్(), వెంకటేశ్ అయ్యర్()లు బ్యాట్ ఝలిపించడంతో మరో 4 ఓవర్లు మిగిలుండగానే లక్షాన్ని చేరుకుంది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈడెన్ గార్డెన్ వేదికగా సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడా విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది కోల్‌కతా. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం దక్కలేదు.
కోల్‌కతా బౌలర్ల ధాటికి పృథ్వీ షా(13), జాక్ ఫ్రెజర్(12) వెనువెంటనే ఔటై పెవిలియన్ చేరారు. ఇక వన్ డౌన్‌లో వచ్చిన అభిషేక్ పోరెల్(18) సయితం తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అనంతరం రిషభ్‌పంత్(27) కొంతసేపు పోరాడి స్కోరు బోర్డును 100 పరుగులకు దాటించాడు. ఇక చివరలో కుల్‌దీప్ యాదవ్(35) బ్యాట్‌తో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగుల గౌరవప్రదమై స్కోరు చేయగలిగింది ఢిల్లీ.