Thursday, September 18, 2025

జనవరి 10న ‘గేమ్ చేంజర్’

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈనెల 9న లక్నోలో ఈ మూవీ టీజర్ రిలీజ్‌కు భారీ సన్నాహాలు చేయటం విశేషం.

11 చోట్ల టీజర్‌ను అభిమానుల సమక్షంలో విడుదల చేస్తుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ‘జరగండి జరగండి.. ’, ‘రా మచ్చా రా..’ పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘గేమ్ చేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎన్నికలను నిబద్ధతతో నిర్వహించే ఆఫీసర్‌గా గ్లోబల్ స్టార్ మెప్పించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News