Monday, December 2, 2024

సంజు శాంసన్ విధ్వంసం… తొలి టి20లో ఇండియా గెలుపు

- Advertisement -
- Advertisement -

డర్బన్: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో టీమిండియా విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీమిండియా 61 పరుగులతో గెలుపొందింది. దీంతో మొ దట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగుల భారీ స్కోరును సాధించింది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిని సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులు చేసి ఆలౌటైంది. సఫారీ బ్యాట్స్‌మెన్లలో హెన్రీచ్ క్లాసెన్ (25), గెరాల్డ్ కోయిట్జ్(23), రికెల్టన్(21), ట్రిస్టన్ స్టబ్స్(11), డెవిడ్ మిల్లర్(18), మార్కో జాన్సెన్(12) పరుగులు చేశారు. బ్యాట్స్‌మెన్లు విఫలం కావడంతో సౌతాఫ్రికా ఓటమిని చవిచూసింది. ఓపెనర్ సంజు శాంసన్ విధ్వంసక శతకంతో చెలరేగి పోయాడు. సంజూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సంజు ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. అతన్ని కట్టడి చేసేందుకు సౌతాఫ్రికా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరుస సిక్స ర్లు, ఫోర్లతో సంజు కనువిందు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (21), తిలక్‌వర్మ (33) అతనికి అండగా నిలిచారు. చెలరేగి ఆడిన శాంసన్ 50 బంతుల్లోనే 10 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 107 పరుగులు చేశాడు. సెంచరీ చేసిన సంజూకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీయగా అవేశ్ ఖాన్ రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News