Wednesday, May 14, 2025

ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓల్డ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం దివాన్‌దేవిడిలోని ప్రమావశాత్తు మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తులోని వస్త్ర దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీగా మంటలు చెలరేగుతుండటంతో పది ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News