Friday, May 9, 2025

ఐర్లాండ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 291 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆతిథ్య జింబాబ్వే టీమ్ విఫలమైంది. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 228 పరుగులకే కుప్పకూలింది. వెస్లీ మధెవర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఐర్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న వెస్లీ 195 బంతుల్లో 8 ఫోర్లతో 84 పరుగులు సాధించాడు. మిగతా వారిలో బ్రియన్ బెన్నెట్ (45), కెప్టెన్ జోనాథన్ క్యాంప్‌బెల్ (33) మాత్రమే రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో మాథ్యూ ఆరు, బారి మెక్ కార్టి రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 260, రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసింది. జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News