Saturday, May 17, 2025

పంజాబ్‌కు కీలకం

- Advertisement -
- Advertisement -

నేడు చెన్నైతో పోరు
చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు వైదొలిగిందనే చెప్పాలి. పంజాబ్‌కు మా త్రం ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయి. చెన్నైతో జరిగే మ్యాచ్ లో విజయం సాధించి నాకౌట్ ఛా న్స్‌ను మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. కోల్‌కతాతో జరిగిన కిందటి మ్యాచ్ వర్షంతో అర్ధాంతరంగా రద్దు కావడంతో పంజాబ్‌కు ప్రతికూలంగా మారింది. ఇలాంటి స్థితిలో చెన్నై పోరులో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నైతో పోల్చితే బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ బలంగా ఉంది.

ప్రి యాంశ్ ఆర్య, ప్రభ్‌స్రిమన్ సిం గ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, నెహల్ వధెరా, శశాంక్ సింగ్, మార్కొ జాన్సన్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నా రు. ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్ ఫామ్‌లో ఉండడం పం జాబ్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. అంతేగాక జాన్సన్, అర్ష్‌దీప్, మాక్స్‌వెల్, యుజువేంద్ర చాహ ల్, హర్‌ప్రీత్‌బ్రార్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు పం జాబ్‌కు అందుబాటులో ఉన్నారు. ఒంటిచేత్తో మ్యా చ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఉండడంతో పంజాబ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోం ది. మరోవైపు చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి కాస్తయినా ఊరట పొందాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో చెన్నై అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇలాంటి స్థితిలో పటిష్టమైన పంజాబ్‌తో పోరు సిఎస్‌కెకు సవాల్ వంటిదేనని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News