Sunday, June 1, 2025

ముంబయి కొత్త పోలీస్ చీఫ్‌గా దేవేన్ భార్తి

- Advertisement -
- Advertisement -

26/11 ఉగ్ర దాడులతో సహా అనేక ఉన్నత స్థాయి కేసుల దర్యాప్తులో పాల్గొన్న సీనియర్ ఐపిఎస్ అధికారి దేవేన్ భార్తి బుధవారం ముంబయి కొత్త పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 35 ఏళ్ల సర్వీస్ అనంతరం రిటైరైన వివేక్ ఫన్సల్కర్ స్థానంలో 1994 బ్యాచ్ ఐపిఎస్ అధికారి దేవేన్ భార్తి పోలీస్ కమిషనర్ అయ్యారు. భార్తి ఇంత వరకు ముంబయి పోలీస్ ప్రత్యేక కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. భార్తి నియామకానికి సంబంధించిన ఉత్తర్వును జారీ చేసిన మహారాష్ట్ర హోమ్ శాఖ ఆయన పదవిని అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ (ఎడిజిపి) ర్యాంక్‌కు తగ్గించింది. ప్రతిష్ఠాత్మక ముంబయి పోలీస్ కమిషనర్ పదవి సాంప్రదాయకంగా ఎడిజిపిగానే ఉండేది. కానీ ఇటీవలి కొన్ని పోస్టింగ్‌ల సమయంలో దానిని డైరెక్టర్ జనరల్ (డిజి) స్థాయికి పెంచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News