అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటాం
గత ప్రభుత్వ నిర్లక్షం వల్లే పనులు
ముందుకు సాగలేదు నిపుణుల
సూచనల మేరకే ఎస్‌ఎల్‌బిసిలో
సహాయక చర్యలు మంత్రి ఉత్తమ్
కుమార్‌రెడ్డి వెల్లడి క్షేత్రస్థాయిలో
వివిధ ప్రాజెక్టుల పనుల పరిశీలన
మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి/కొల్లాపూర్: మహబూబ్‌నగర్ ఉ మ్మడి జిల్లా ప్రాజెక్టులను అత్యంత ప్రా ధాన్యతగా గుర్తించి పూర్తి చేస్తామని రా ష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువా రం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు లో ప్రధాన భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పంప్ హౌస్, ప్యాకేజి 2 ఓపెన్ కెనాల్, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లిఫ్ట్ 1, వనపర్తి జిల్లా రేవల్లి మండలం ఎదుల రిజర్వాయర్, స్టేజ్ 2, కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ హౌస్, సొరంగం, కాల్వ నిర్మాణ పనులను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదే విధంగా నాగర్‌కర్నూల్ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ కార్యాలయాల భవన సముదాయాలను వారు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీల ప్రతినిధులు పనుల ప్రగతిని మంత్రులకు వివరించారు. ప్రాజెక్టుల సందర్శన అనంతరం నాగర్‌కర్నూల్ కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో మంత్రులు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీంటిని వేగవంతంగా చేయడానికి సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి తాము ప్రాజెక్టులను సందర్శించినట్లు చెప్పారు.
మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్షం చేసిందని, పదేళ్లుగా ఈ ప్రాజెక్టుల పనులు ముందుకు సాగలేదన్నారు. ఈ నాలుగు ప్రాజెక్టులన్నీంటిని సంపూర్ణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 2026 మార్చి 31 వరకు అన్ని విధాలుగా 100 శాతం పనులను పూర్తి చేయడానికి ఆ దిశగా చర్యలు- తీసుకోనున్నట్లు వెల్లడించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన రిజర్వాయర్‌లో 50 టిఎంసిల నీటిని నింపడానికి ఆరు నెలల సమయం పెట్టుకుని, ఏం ఏం పనులు చేయాలో, అదే విధంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నింపడానికి 2026 మార్చి వరకు నిర్దిష్ట గడువును నిర్దేశించుకుని ప్రణాళికబద్ధంగా పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మొదటి లిఫ్టులో నిరుపయోగంగా ఉన్న రెండు మోటర్లను రెండు మూడు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
నిపుణుల సూచనల మేరకు ఎస్‌ఎల్‌బిసిలో సహాయక చర్యలు
ఎస్‌ఎల్‌బిసి ఘటన దురదృష్టకరమని ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా ఇద్దరి మృతదేహాలను వెలికితీయడం జరిగిందని మిగతా ఆరుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిపుణుల సూచనల మేరకు సొరంగంలో కూలిన మట్టిని తొలగించే పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సొరంగంలోని మట్టి మొత్తాన్ని తొలగించడం జరిగిందని, అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో తవ్వకాలు జరపడానికి నిపుణుల సూచనలు పాటిస్తున్నామని మంత్రి అన్నారు. మృతులు అందరి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. ఎస్‌ఎల్‌బిసి పనులను పూర్తి చేసి సాగునీటిని అందించడమే లక్షంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన వివరించారు.
ఇరిగేషన్ భవన సముదాయం పరిశీలన
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ భవన సముదాయాన్ని మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాలను చూపించారు. 18 ఎకరాల స్థలంలో పది ఎకరాలలో జరుగుతున్న నిర్మాణాలను మంత్రులు పరిశీలించారు. మంత్రుల వెంట ఎంపి మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.