Saturday, July 27, 2024

12,71,000 మంది ఆడ పిల్లలకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: తెలంగాణలో అభివృద్ధి పండుగ జరగుతుందని, శుక్రవారం ఒకేసారి 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించుకున్నామని, శనివారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను సిఎం కెసిఆర్ ప్రారంభిస్తున్నారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు., సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మైనార్టీ బంధు , బీసీ బంధు లబ్ధిదారుల తోపాటు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు.అదేవిధంగా జి వో నంబర్ 58, 59 ద్వారా లబ్ధిదారులకు రెగ్యులైజేషన్ మంజూరు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండా ఒక రూపాయి అప్పు లేకుండా నేరుగా లక్ష రూపాయలు బిసి బంధు కింద ఇస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. వర్గాలను అభివృద్ధి చేయాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు బిసి బందు పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు.

Also Read: వాటర్ బాటిల్ లో మూత్రం… ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయురాలు

బిసిల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు సిఎం కెసిఆర్ చేపట్టారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో బిసి రెసిడెన్షియల్ పాఠశాలలు, బిసి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, బిసి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామని, మైనార్టీల సంక్షేమం పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. మైనార్టీలు సురక్షితంగా ఉన్నారంటే అది తెలంగాణలోనేనని, బిజెపి పాలిత ప్రాంతంలో మైనార్టీలు అభద్రత భావంతో జీవనం సాగిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మైనార్టీ సంక్షేమంతో పాటు మైనార్టీ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ పాఠశాలను కళాశాలలను ప్రారంభించుకున్నామని, కర్ణాటకలో ముస్లిం మైనార్టీలు 90 లక్షల మంది ఉన్నారని, మహారాష్ట్రలో కోటి 50 లక్షల మంది ఉన్నారని, బెంగాల్ లో రెండు కోట్ల 55 లక్షల మంది అదేవిధంగా ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగు కోట్ల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారని చెప్పారు. ఈ రాష్ట్రాల్లో 2 వేల కోట్లకు మించి ముస్లిం మైనార్టీల కోసం బడ్జెట్ కేటాయించలేదని దుయ్యబట్టారు. అదే తెలంగాణ లో 50 లక్షల మంది ముస్లిం మైనార్టీలు ఉంటే వారి కోసం రెండు వేలకోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని హరీష్ రావు ప్రశంసించారు. అంటే ముఖ్యమంత్రి కెసిఆర్ కు ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎంత కట్టుబడి ఉన్నారనేది ఆలోచించాలని, హిందువులైన ముస్లింలైన అందరికోసం పనిచేసేది  బిఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మాదిరి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఇస్తలేదని, ఇప్పటి వరకు 12 లక్షల 71,000 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి కెసిఆరేనని స్పష్టం చేశారు. 11 వేల 130 కోట్లు ఇప్పటివరకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్లకు రాష్ట్ర ప్రభుత్వం అందించిందని, చత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల కరెంటు వాడకం కంటే హైదరాబాద్ కరెంటు వాడకం ఎక్కువగా ఉందని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్ లో 2000 మెగావాట్ల వినియోగంలో ఉందని, ఇవాళ 6000 మెగావాట్లు పెరిగిందన్నారు.

నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన కరెంటును అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మెచ్చుకున్నారు. మెట్రో రైల్ కూడా తొందర్లో పటాన్ చెరు వరకు రానుందని, అదేవిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పటాన్ చెరు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించారని. మళ్లీ పటాన్ చెరులో గూడెం మహిపాల్ రెడ్డిని గెలిపించాలని, మూడోసారి ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆశీర్వదించాలన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేయడం చేతకాలేదని, ఇప్పుడు చేస్తామంటే నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని హరీష్ రావు దుయ్యబట్టారు. ఆకలైనప్పుడు అన్నం పెట్టడం చేతకాని కాంగ్రెసోళ్లకు అవసరానికి గోరిముద్దలు తినిపిస్తామంటే ప్రజలు నమ్మరని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణకు మించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి చూపించాలని హరీష్ రావు సవల్ విసిరారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, సంగారెడ్డి జిల్లా కలాక్టర్ శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News