- Advertisement -
ఢిల్లీలో నిర్వహించిన సిడబ్ల్యూసి సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రెండు తీర్మానాలు చేసింది. ముందుగా కులగణనపై కాంగ్రెస్ పార్టీ వాచ్‌డాగ్ పాత్ర పోషించాలని తీర్మానం చేసిన సిడబ్ల్యూసి.. తర్వాత పహల్గామ్ ఉగ్రదాడిపై తాత్సారం చేయకుండా, వెంటనే యాక్షన్‌లోకి దిగాలని మరో తీర్మానం చేసింది. కులగణనను పారదర్శకంగా చేయాలని కాంగ్రెస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కాగా తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని..రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఊహించని విధంగా మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీనికి కేంద్ర కెబినేట్ కూడా ఆమోదం తెలిపింది.
- Advertisement -