Sunday, May 4, 2025

చెన్నై లక్ష్యం 214

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్‌లో భాగంలో చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. చెన్నై ముందు 214 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఉంచింది. రోమారియో షెఫెర్డ్ 14 బంతుల్లో 53 పరుగులు చేసి ఔరా అనిపించారు. ఖలీల్ అహ్మద్ వేసి 19 ఓవర్ లో 33 పరుగులు, 20 ఓవర్ లో 21 పరుగులతో  చెలరేగిపోయాడు. జాకోబ్ బెతెల్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బెతెల్ 55 పరుగులు చేసి మతీషా పతీరాణ బౌలింగ్‌లో బ్రెవీస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 62 పరుగులు చేసి శ్యామ్ కరణ్ బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రజత్ పాటిదర్ (11), జితేశ్ శర్మ (7), టిమ్ డెవిడ్(0) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో మతీషా పతిరాణా మూడు వికెట్లు, నూర్ అహ్మద్, శామ్ కరణ్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News