Tuesday, May 6, 2025

నేటి అర్థరాత్రి నుంచి ఆర్‌టిసి సమ్మె

- Advertisement -
- Advertisement -

డిపోలకే పరిమితం కానున్న బస్సులు రెండుగా చీలిన జెఎసిలు
సమ్మెకు దూరంగా ఆశ్వత్థామ వర్గం సమ్మె వద్దని మంత్రి
పొన్నం విజ్ఞప్తి చర్చలకు పిలువలేదంటున్న వెంకన్న సారథ్యంలోని
జెఎసి నేతలు ఆశ్వత్థామ వర్గంతో పొన్నం భేటీ సమ్మెకు మద్దతుగా
హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి కళాభవన్ నుంచి భారీ ఎత్తున ఉద్యోగుల
కవాతు సమస్యలకు సమ్మె పరిష్కారం కాదు : యాజమాన్యం

మన తెలంగాణ / హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్‌టిసి కార్మికులు సమ్మెకు సన్నద్దమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్తున్నారు. దీంతో మే 7వ తేదీ నుండి రాష్ట్రంలో బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. అయితే అశ్వథ్థామ రెడ్డి నేతృత్వంలోని ఆర్‌టిసి జెఎసి సమ్మెకు దూరంగా ఉంది. దీంతో ఆర్‌టిసి సంఘాలు రెండు జెఎసీలుగా చీలి పోయాయి. వెంకన్న నేతృత్వంలోని ఆర్‌టిసి జెఎసి సమ్మె నోటీసు ఇచ్చి 7 నుండి సమ్మెకు వళుతుండగా అశ్వత్థామ రెడ్డి నేతృత్వంలోని జెఎసి సమ్మెకు దూరంగా ఉంటూ విధులకు హాజరవుతోంది. అశ్వథ్థామరెడ్డి జెఎసిలో ఎన్‌ఎంయు, కార్మిక సంఘ్, ఎస్‌టిఎంయు సంఘాలు సమ్మెకు దూరంగా ఉన్నాయి.

వెంకన్న చైర్మన్‌గా ఉన్న జెఎసిలో ఎంప్లాయీస్ యూనియన్, టిజెఎంయు, టిఎంయు, ఎన్‌ఎంయు, బికెయు, బిడబ్లుయు, కెపి సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. అశ్వత్థామ రెడ్డి జెఎసికి కార్మిక మద్దతు లేదని, ప్రభుత్వం, ఆర్‌టిసి యాజమాన్యం సమ్మెను విచ్చిన్నం చేయడానికి వారిని ఉసిగొల్పుతోందని వెంకన్న అన్నారు. సమ్మె పూర్తిగా విజయవంతం అవుతుందని పేర్కొన్కానరు. తాము ఇదివరకే సమ్మె నోటీసు ఇచ్చామని, అశ్వత్థామ రెడ్డి వర్గం సమ్మె నోటీసు ఇవ్వలేదని ఆయనన్నారు. తాము సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుండి చర్చలకు పిలుపు రాలేదని, గత్యంతరం లేక సమ్మెలోకి వెళ్ళాల్సి వస్తోందని వెంకన్న అన్నారు.

గత ఆరు నెలలుగా దశలవారిగా కార్యాచరణతో నిరసన తెలిపిన ప్రభుత్వం కాని, యాజమాన్యం కాని చర్చలకు పిలువలేదన్నారు, కార్మికుల సమస్యల పరిష్కరించాలన్న చిత్తశుద్ది ప్రభుత్వంలో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామి మేరకు ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణలు, యూనియన్లను పునరుద్దరణ, కొత్త బస్సులు కొనుగోలు ఆచరణకు నోచుకోలేదన్నారు. 18 నెలలు దాటుతున్నా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయలేదని జెఎసి నేతలు పేర్కొన్నారు 7 నుండి జరగబోయే సమ్మెలో అన్ని యూనియన్లు, అందులో ఉన్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ లు, సూపర్ వైజర్లు, మహిళా సిబ్బంది, గ్యారేజి సిబ్బంది, అద్దె బస్సుల డ్రైవర్లు ఎవరి గురించి భయపడకుండా సమ్మెలో పాల్గొనాలని, మీకు మేము అండగా ఉంటామని, ధైర్యంగా ముందుకు వెళ్ళాలని జెఎసి నేతలు పిలుపునిచ్చారు

సమ్మె వద్దు : మంత్రి పొన్నం

సమ్మెకు మద్దతు ఇవ్వని మరికొన్ని సంఘాల జెఎసి నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. టిఎంయూ జనరల్ సెక్రెటరీ అశ్వద్ధామ రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఆర్‌టిసి జెఎసి నేతలు ఎన్‌ఎంయూ జనరల్ సెక్రెటరీ నరేందర్ ,కార్మిక సంఘ్ జనరల్ సెక్రెటరీ ఎర్ర స్వామి కుమార్ , ఎస్‌టిఎంయు జనరల్ సెక్రెటరీ పున్న హరి కృష్ణ తదితరులు సోమవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. తమ జెఎసి సంఘాలు 7 నుండి జరిగే ఆర్‌టిసి సమ్మెలో పాల్గొనడం లేదని చైర్మన్ అశ్వథ్థామ రెడ్డి తెలిపారు. కాగా ఆర్‌టిసి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్‌టిసి సమస్యల పై , ఆర్‌టిసి సంక్షేమం కోరే ఎవరైనా ఈరోజు , రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని, మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని చెప్పారు.

సమస్యలు వినడానికి తాను, సిఎం కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని, సమ్మె వద్దని వారించారు. సంస్థ పరిరక్షణ,కార్మికుల సంక్షేమం ,ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆర్‌టిసి ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, సమస్యలు తొలుగుతున్నాయన్నారు. మీ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానని హామినిచ్చారు. సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారని అన్నారు. త 10 సంవత్సరాలుగా ఆర్‌టిసిని నిర్వీర్యం చేశారు..

ఒక్క బస్సు కొనుగోలు చేయలేదు ,ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు, సిసిఎస్, పిఎఫ్ పైసలు వాడుకున్నారని, ఉద్యోగులకు 2013 నుండి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు ఆర్‌టిసి చెల్లించిందని, 2017 పే స్కేల్ 21 శాతం ఇచ్చామని, సంవత్సరానికి 412 కోట్లు భారం పడుతుందని మంత్రి అన్నారు. పిఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగ పెండింగ్ లో ఉన్న 1039 కోట్లు చెల్లించామని, నెలవారీ పిఎఫ్ కంట్రిబ్యూషన్ జనవరి -2024 నుండి క్రమం తప్పకుండా చెల్లించబడుతుందని, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సిసిఎస్ బకాయిలు ఉద్యోగులకు 345 కోట్లు చెల్లించామన్నారు. 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టామని, ప్రభుత్వం ఆర్‌టిసిలో 3038 మంది ఉద్యోగులను రిక్రూట్‌మెంట్ చేయడానికి అనుమతి ఇచ్చిందని, కొత్త బస్సులు కొనుగోలు చేశాం ,తార్నాక ఆసుపత్రి ను సూపర్ స్పెషాలిటీ గా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News