ఐపిఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావించిన హైదరాబాద్ జట్టుకు వరుణుడు షాకిచ్చాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ షాకిచ్చాడు. వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టి ఢిల్లీని దెబ్బకొట్టాడు. కమిన్స్ కు తోడు మిగతా బౌలర్లు కూడా రాణించడంతో ఢిల్లీ జట్టు మళ్లీ తేరుకోలేకపోయింది. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది.
స్పల్వ లక్ష్యమే ఉండటంతో ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలబడోచ్చని భావించిన ఎస్ఆర్ హెచ్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. సన్ రైజర్స్ బ్యాటర్లు బరిలోకి దిగే సమయానికి వరుణుడు దంచికొట్టాడు. భారీ వర్షం కురవడంతో స్టేడియం తడిసిపోయింది. చాలాసేపు వేచి చూసినా మ్యాచ్ జరిగే చాన్స్ లేకపోవడంతో అంపైర్లు రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో లీగ్ దశలోనే సన్ రైజర్స్ జట్టు ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.