Tuesday, May 6, 2025

వాళ్లను నమ్మెద్దని కెసిఆర్ చిలుకకు చెప్పినట్లు చెప్పారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చిలుకకు చెప్పినట్లు చెప్పారని.. అయినా వినకుండా కాంగ్రెస్ ను గెలిపించారని.. ఇప్పుడు అనుభవిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు. తెలంగాణ దివాళా తీసిందని సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బిఆర్ఎస్ పార్టీనీ, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించాం.. ఇంకా భరిస్తామని, కానీ తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. సిఎం రేవంత్‌రెడ్డి మాటలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపం పెట్టినట్లు ఉన్నాయని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి.. అత్యంత అసమర్థ, దక్షతలేని సిఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయిందని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News