Thursday, May 8, 2025

భారత సైనిక పాటవానికి గర్వపడుతున్నా: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

‘భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా నేను గర్వపడుతున్నాను. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో వున్నా, ఏ దేశంలో వున్నా ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదు. ఉగ్రవాదం అంతం కావాల్సిందే’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయని తెలిపారు. భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశ రక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

భారత ఆర్మీకి కేటీఆర్ సెల్యూట్
ఆపరేషన్ సిందూర్ పైన స్పందించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ పాకిస్తాన్‌లోని తీవ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిన భారత ఆర్మీకి సెల్యూట్ అన్నారు. తీవ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టే శక్తి ఆర్మీకి ఉందన్నారు. జై హింద్ అంటూ తన ఎక్స్‌వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News