Friday, May 9, 2025

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో స్టేట్ ఫస్ట్ సాయి చైతన్య విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో మోత్కూరు సాయి చైతన్య పాఠశాల విద్యార్దిని సూరారం లిల్లీ గ్రేస్ బైపిసిలో 440మార్కులకు 438మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిందని సాయి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ బి.రవీందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకు సాధించిన లిల్లీ గ్రేస్‌ను, తల్లిదండ్రులను సాయి చైతన్య యాజమాన్యం, ఉపాద్యాయులు ఘనంగా సన్మానించి, అభినందించారు. భవిష్యత్తులో నీట్‌లో రాష్ట్ర ర్యాంకు సాధించాలని ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎన్.సైదులు, ఎండి. ఫాషా, ఎ.పూజ, యం.లక్ష్మి, బి.అనిత, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Sai Chaitanya student first rank inter results

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News