Thursday, May 8, 2025

‘ఆపరేషన్ సిందూర్’పై సినీ ప్రముఖుల ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

పాక్ ఉగ్రవాద సంస్థలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో చేసి దాడులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. మోదీకి, ఆర్మీకి అండగా ఉంటామని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. తమ సంఘీభావాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన వారు సైతం తన ఆమోదాన్ని, హర్షాన్ని తమదైన శైలిలో తెలుపుతున్నారు. చిరంజీవి సోషల్ మీడియాలోని తన పోస్ట్‌లో ‘జై హింద్’ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్స్‌లో తన మనసులోని భావాలను ఇలా తెలియజేశారు.

“దశాబ్దాలుగా సహనం.. సహనం! మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతం కి ‘ఆపరేషన్ సింధూర్‘ తో తిరిగి భారత సమాజంలో వీరత్వాన్ని నింపిన త్రివిధ దళాధిపతులకు, వారికి వెన్నంటి నిలబడ్డ ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు… మీ వెన్నంటే మేము. జైహింద్!” అని తెలిపారు. రజనీకాంత్ “ఫైటర్స్ ఫైట్ మొదలైంది. మిషన్ పూర్తయ్యే వరకూ ఇది కొనసాగాలి. మొత్తం జాతి అంతా మీవెంటే ఉంది” అంటూ భారత ప్రధాని మోదీని, భారత రక్షణ శాఖను ట్యాగ్ చేశారు. “తగిన న్యాయం జరిగింది. మేరా భారత్ మహాన్. సైనికులకు సెల్యూట్‌”అంటూ సూపర్ స్టార్ మహేష్‌బాబు పోస్ట్ చేశారు.

మోదీ, భారత ఆర్మీ చర్యలను అభినందిస్తూ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నాని, నందమూరి కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, బ్రహ్మాజీ, సంయుక్త, అమీర్ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, శివ కార్తికేయన్, మోహన్ లాల్, మమ్ముట్టి, మంచు మనోజ్ తదితరులు తమ ఎక్స్ ఖాతాల ద్వారా భారత ప్రభుత్వ చర్యలను ప్రశంసించారు. నటుడు ప్రకాశ్ రాజ్ “భారత ఆర్మీకి సెల్యూట్… ఇండియా ఎప్పుడూ టెర్రరిజాన్ని సహించదు’ అని పోస్ట్ చేశారు. ’ఆపరేషన్ సిందూర్’ అనేది సరైన పేరు అని కృష్ణవంశీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ”మోడీజీ రియల్ హీరో, ఆయనకు, భారతీయ ఆర్మీకి సెల్యూట్, వందేమాతరం, ఐ లవ్ భారత్‌” అని కృష్ణవంశీ ఆ పోస్ట్‌లో తెలిపారు. కుష్బూ సుందర్ “భారత్ మాతాకీ జై… న్యాయం జరిగింది… జై హింద్’ అని తన పోస్ట్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News