ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో రాజిరెడ్డి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం కోసం రాజిరెడ్డి పార్ధివ దేహాన్ని హబ్సిగూడలోని ఆయన నివాసంలో ఉంచారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఉప్పల్ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజిరెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాజీ ఎంఎల్ఎ చనిపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఉప్పల్ మాజీ ఎంఎల్ఎ రాజిరెడ్డి కన్నుమూత
- Advertisement -
- Advertisement -
- Advertisement -