- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ అర్దాంతరంగా రద్దు అయ్యింది. మైదానంలోని ఫ్లడ్ లైట్లలో సాంకేతిక సమస్య వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ రద్దు అయ్యే సమయానికి పంజాబ్ జట్టు 10.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది. నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించిన ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(70) మాధవ్ తివారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్(50) కూడా అర్థ శతకంతో చెలరేగాడు. ఆర్య ఔటైన అనంతరం క్రీజులోకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చిన తర్వాత మ్యాచ్ లో అంతరాయం ఏర్పడి రద్దు అయ్యింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కురవడంతో టాస్ ఆలస్యమైంది. వర్షం తగ్గిన తర్వాత 8.15నిమిషాలకు మ్యాచ్ ను ప్రారంభించారు.
- Advertisement -