న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్థాన్‌ల(Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే శనివారం జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. కానీ, పాకిస్థాన్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పట్టించుకోకుండా భారత్‌పై దాడి చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ దాడిని భారత్‌కు తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు తమ మద్ధతు ఉంటుందని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బిఎల్‌ఎ)(BLA) ప్రకటించింది.
ఈ మేరకు భారత్‌కు మద్దతుగా ఓ లేఖను విడుదల చేసింది. చాలా కాలంగా పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బిఎల్‌ఎ(BLA) పోరాటం చేస్తోంది. ఈ మధ్య కాలంలో పలు మార్లు పాక్ సైనికులపై దాడులు చేయడం, రైళ్లను హైజాక్ చేయడం వంటివి చేసి.. పాక్‌ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు భారత్, పాక్(BLA) మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో దాన్ని అవకాశంగా తీసుకోవాలని బిఎల్‌ఎ బావిస్తోంది. ఈ మేరకు తాము విడుదల చేసిన లేఖలో బిఎల్‌ఎ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. టెర్రరిస్టులకు అడ్డాగా పాకిస్థాన్ మారిందని. పాక్‌పై భారత్ సైనిక చర్యకు దిగితే అండగా ఉంటామని పేర్కొంది. అవసరమైతే.. భారత్‌కు సైనిక శక్తిగా మారుతాం స్పష్టం చేసింది.