- Advertisement -
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ దర్శకత్వంలో మరో మూవీ రాబోతోంది. కల్ట్ టైటిల్ తో విశ్వక్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వహించారు. మెగా ప్రడ్యూసర్ అల్లు అరవింద్, మాజీ మంత్రి తలసానీ శ్రీనివాస్ యాదవ్ లు ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో అందరినీ కొత్త వాళ్లనే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. కాగా, విశ్వక్ ఇప్పటికే ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి మాస్ సినిమాలను తన దర్శకత్వంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
- Advertisement -