Saturday, May 17, 2025

వేదికపైనే పడిపోయిన హీరో.. ఆస్పత్రికి తరలింపు

- Advertisement -
- Advertisement -

హీరో విశాల్‌ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా స్టేజీపైనే పడిపోవడంతో వెంటనే ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండవర్‌ ఆలయంలో చిత్తిరై(తమిళమాసం) వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, ఒక్కసారిగా ఆయన స్టేజీపైనే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనకు ప్రథమ చికిత్స చేయడంతో స్పృహలోకి వచ్చారు. తర్వాత ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఇటీవల తన నటించినమద గజ రాజా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న విశాల్.. వణుకుతూ చాలా నీరసంగా కనిపించారు. ఆయన మైక్ పట్టుకుని మాట్లాడుతుండగా.. చెయి వణుకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విశాల్ కు ఎదో జరిగిందని.. ఆయన ఏదో వ్యాధి బారిన పడినట్లు రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో స్పందించిన విశాల్ టీమ్.. ఆయనకు ఏం కాలేదని.. తీవ్ర జ్వరం ఉండటం వల్లే అలా ఉన్నారని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఆయన స్టేజీపైనే పడిపోవడం అందరినీ షాక్ గురి చేసింది. ఈ ఘటనలతో విశాల్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News