- Advertisement -
రాష్ట్రంలో 732 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన, పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రీక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 27,101 మంది దరఖాస్తు చేసుకోగా, 24,578 మంది పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరించింది. https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మార్కులను అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ మార్కుల వివరాలను చూసుకోవాలని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది.
- Advertisement -