ఆర్‌కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం దీక్ష. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జూన్ నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..“ఒక వ్యక్తి దీక్ష, (Deeksha) పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే మంచి పాయింట్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకున్నాం. అలాగే మైథలాజికల్‌ను జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో కిరణ్ భీముడు పాత్రలో అద్భుతమైన నటన కనపరచాడు”అని చెప్పారు. హీరో కిరణ్ మాట్లాడుతూ దీక్ష టైటిల్‌కు తగ్గట్టే.. అందరూ చాలా కష్టపడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్సఖాన్, తులసి, రోహిత్ శర్మ, రాజ్ కిరణ్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.
మంచి పాయింట్‌తో ఫ్యామిలీ డ్రామా
- Advertisement -
- Advertisement -
- Advertisement -