ముంబై: టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి (virat kohili) కి క్రీడా ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్‌తో సహా పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు కోహ్లి సేవలను కొనియాడారు. అతనిలాంటి క్రికెటర్ చాలా అరుదుగా లభిస్తాడని సచిన్ పేర్కొన్నాడు. యువ క్రికెటర్లు తమ కలలను సాకారం చేసుకునేలా కోహ్లి వారసత్వాన్ని నిర్మించాడని ప్రశంసించాడు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడని కొనియాడాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, ద్రవిడ్, లక్ష్మణ్, కైఫ్, జహీర్ ఖాన్, హర్భజన్ తదితరులు సయితం కోహ్లిని ప్రశసంలతో ముంచెత్తారు.
అనుష్క భావోద్వేగ పోస్టు
ఈ సందర్భంగా కోహ్లి సతీమణి అనుష్క శర్మ పెట్టిన ఎమోషనల్ పోస్టు వైరల్‌గా మారింది. అనుష్క తన భర్త కోహ్లి గురించి భావోద్వేగ పోస్టును షేర్ చేసింది. అంద రూ రికార్డుల, మైలురాళ్ల గురించే మాట్లాడవచ్చు. నాకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు.. ఎవరికి తెలియకుండా నీతో ను వ్వు చేసిన యుద్ధలు చిరకాలం గుర్తుండిపోతాయి. టెస్టు క్రికెట్‌పై నీకు న్న ప్రేమ, అంకిత భావాన్ని ఎప్పటికీ మరచిపోలేను. ప్రతి టెస్టు సిరీస్ తర్వాత నువ్వు ఎంతో గొప్పగా తిరిగి వచ్చేవాడివి. నువ్వు ఎదిగిన వి ధానాన్ని పక్కన ఉండి చూడడం తనకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తానని అనుష్క పేర్కొంది. ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఏదో ఒకరోజు రిటైర్మెంట్ ఉంటుందని, నీవు టెస్టుల నుంచి రిటైర్ అవుతావని తెలు సు. ఆటలో నీవు సాధించనిది ఏదీ లేదని, టెస్టులకు గుడ్‌బై చెప్పేందుకు ఇదే మంచి సమయమని నీవు భావించి తీసుకున్న నిర్ణయాన్ని భార్యగా తాను గౌరవిస్తానని అనుష్క తన పోస్టులో తెలిపింది.