ముంబై: భారత్-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను(IPL) బిసిసిఐ వాయిదా వేసిన విషయం తెలసిందే. అయితే పరిస్థితులు కాస్త ప్రశాంతంగా మారడంతో మళ్లీ ఐపిఎల్‌ను మే 17వ తేదీ నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే కేవలం ఆరు వేదికల్లోనే ఈ టోర్నమెంట్ జరుగను్నట్లు వెల్లడించింది. బెంగళూరు. జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహించనున్నారు. అయితే ఈ మెగా టోర్నమెటం ఆగిపోయిన పంజబ్(Punjab Kings), ఢిల్లీల మధ్య మ్యాచ్‌తో తిరిగి ప్రారంభం అవుతుంది.
మే 24న జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అప్పడు ఆడిన 10.1 ఓవర్లతో సంబంధం లేకుండా మొదటి నుంచి ఈ మ్యచ్ జరుగుంది. ఇది ఒక రకంగా పంజామ్ ఒక రకంగా నష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆగిపోయిన మ్యాచ్‌లో పంజాబ్ 10.1 ఓవర్‌లతో 122 పరుగులు చేసింది. ఇప్పుడు మళ్లీ మ్యాచ్ పంజాబ్ స్కోర్ తరుమారు అయ్యే అవకాశం ఉంది.