Wednesday, May 14, 2025

ఉప్పల్ కు మొండిచెయ్యి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భా రత్‌పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొ న్న ఘర్షణ వాతావరణం నేపథ్యం లో ఐపిఎల్ సీజన్ 2025ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మ ధ్యలోనే నిలిపి వేసింది. అయితే యుద్ధ మేఘాలు తొలగిపోయి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడంతో ఐపిఎల్‌ను తిరిగి నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రీషెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. టోర్నమెంట్‌లో మిగిలిన 17 మ్యాచ్‌లను నిర్వహించేందుకు బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఐపిఎల్ మధ్యలో ఆగిపోయే సమయానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇందులో ఒకటి లీగ్ మ్యాచ్ కాగా, మరో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ, తాజా షెడ్యూల్‌లో హైదరాబాద్‌కు ఒక్క మ్యాచ్ కూడా కేటాయించలేదు.

నిజానికి సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్టా దక్షిణాదిలోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలోనే మిగిలిన మ్యాచ్‌లను నిర్వహిస్తారని అందరూ భావించారు. ఐపిఎల్ నిర్వాహకులు మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఉత్తరాది నగరాల్లోనే ఎక్కువ మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్, చెన్నైలకు ఒక్క మ్యాచ్ కూడా దక్కలేదు. సౌత్‌లో ఒక్క బెంగళూరుకు మాత్రమే ఛాన్స్ లభించింది. ఇక ఉత్తరాదికి చెందిన లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, ముంబైలకు మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం దక్కింది. హైదరాబాద్‌కు మాత్రం ఐపిఎల్ నిర్వాహకులు మొండిచెయ్యి చూపారు. ఒక్క మ్యాచ్ కూడా కేటాయించక పోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించడం అనవాయితీగా వస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంకా మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా ఉప్పల్‌కు ఒక్కటి కూడా కేటాయించక పోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కతాతో జరగాల్సిన మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు కావడంతో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు ఆవేదనకు గురయ్యా రు. రీషెడ్యూల్‌లో హైదరాబాద్‌కు కనీసం ఒక్క మ్యాచ్ అయినా కేటాయిస్తారని భావించినా నిరాశే మిగిలింది.

ప్లేఆఫ్ మ్యాచ్‌లైనా దక్కేనా?

లీగ్ మ్యాచ్‌లు నిర్వహించే ఛాన్స్ దక్కక పోయినా కనీసం ప్లేఆఫ్ పోటీలకైనా ఆతిథ్య ఇచ్చే అవకాశం హైదరాబాద్‌కు దక్కుతుందా లేదా చూడాలి. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లకు హైదరాబాద్ వేదికగా ఉంది. కానీ కొత్త షెడ్యూల్‌లో ప్లేఆఫ్ వేదికలను ఖరారు చేయలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే నాకౌట్‌కు దూరం కావడంతో ఉప్పల్ స్టేడియానికి ఈ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం దక్కుతుందా లేదా చెప్పలేం. దక్షిణాది రాష్ట్రాల్లో జూన్ ఆరంభంలో భారీ వర్షాలు పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే లీగ్ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం చెన్నై, హైదరాబాద్‌లకు ఇవ్వలేదని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇలాంటి స్థితిలో నాకౌట్ మ్యాచ్‌లు కూడా హైదరాబాద్‌లో జరగడం కష్టంగా మారింది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News