Wednesday, May 14, 2025

‘సితారే జమీన్‌ పర్’కి నిరసన సెగ.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan) వెండితెరపై కనిపించి దాదాపు మూడు సంవత్సరాలు అయింది. 2022 ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా ఊహించినంత సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పుడు ఆయన 2007లో వచ్చిన ‘తారే జమీన్ పర్’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘సితారే జమీన్‌ పర్’(Sitaare Zameen Par) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

అయితే ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమాకు నిరసన సెగ తగిలింది. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ.. నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ‘BoycottSitaareZameenPar’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. అందుకు కారణం ఏంటంటే.. ప్రస్తుతం దేశవ్యాప్తం టర్కీపై ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగన పోరులో శత్రుదేశానికి టర్కీ సహాయం చేసిందని.. ఆ దేశం నుంచి పలు దిగమతులను మన దేశం నిషేధం విధించింది.

అయితే అమీర్ ఖాన్ టర్కీ అద్యక్షురాలితో గతంలో కలిసి వీడియోని సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్న నెటిజన్లు అమీర్‌ఖాన్‌పై(Aamir Khan) విరుచుకుపడుతున్నారు. ‘‘అప్పుడు టర్కీలో సరదాగా గడిపి.. ఇప్పుడు వాళ్లు మనపై దాడి చేస్తున్న సమయంలో తన సినిమాకు మద్దతు కోరుతున్నాడు అమీర్ ఖాన్.. మాకు అంత మతిమరపు లేదు’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అంతేకాక.. చాలా మంది కూడా ‘సితారే జమీర్ పర్’(Sitaare Zameen Par) సినిమాను ట్రోల్ చేస్తూ.. ఆ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News