పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓజి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోం ది. ఇక ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ దగ్గ ర సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో పవన్ చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం నుంచి హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పవన్ పాల్గొంటున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. పవన్ ఈ సినిమా షూటింగ్‌లో చేరి యాక్షన్ మూడ్‌లోకి మారిపోయాడని వారు కామెంట్ చేస్తున్నారు. అందాల భామ ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక ‘ఈ సారి షూటింగ్ ముగిద్దాం’ అని నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ స్టయిల్‌లో ట్వీట్ చేసింది.
మొత్తానికి ఈ షూటింగ్‌ని పూర్తి చేసి ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది సినిమా టీమ్. ఇక వచ్చే నెల హరి హర వీర మల్లు, సెప్టెంబర్‌లో ఓజి విడుదల అనేది తాజా ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం అంతా సవ్యంగా జరిగితే ఐదారు నెలల గ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ నుంచి రెండు సినిమాలు విడుదలవుతాయి.